![]() |
![]() |

ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమోలో కొన్ని ఇంటరెస్టింగ్ స్కిట్స్ రాబోతున్నాయి. ఇందులో వర్ష ఇమ్మానుయేల్ కి హ్యాండ్ ఇచ్చిన స్కిట్ ఐతే ఫుల్ కామెడీగా ఉంది. ఇక పంచ్ డైలాగ్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ స్కిట్ లో ఇమ్ము - శ్రీవిద్య భార్యాభర్తలుగా నటించారు.. వాళ్లకు ఆపోజిట్ గా వర్ష- బాబు భార్యాభర్తలుగా నటించారు. ఒకరోజు వర్ష వచ్చి ఇమ్ము అని పిలిచేసరికి "మా ఆయనతో మీకేం పని" అంటూ శ్రీవిద్య వర్షని అడిగేసరికి షాకైపోయింది వర్ష. ఇమ్ము కాలర్ పట్టుకుని "నన్ను మోసం చేసి దాన్ని పెళ్లి చేసుకుంటావా' అని నిలదీసింది.
దానికి శ్రీవిద్య ఎంట్రీ ఇచ్చి "నువ్వే ఎంతో మందిని మోసం చేసావో అతన్నంటావేంటి" అని సీరియస్ ఐపోయింది శ్రీవిద్య. ఆ కోపంతో వర్ష వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది. శ్రీవిద్య వదిలేసిన అబ్బాయి బాబు, ఇమ్ము వదిలేసిన అమ్మాయి వర్ష కలిసి పెళ్లి చేసుకుని ఒకరికొకరు ముద్దూ ముచ్చట్లు ఆడుకోవడం చూసిన ఇమ్ము షాకైపోయాడు. బాబు ఒళ్ళో కూర్చుని మరీ టీని తాపించిన వర్షని చూసి అవాక్కయ్యాడు ఇమ్ము. అలాగే ఈ వారం ఆటో రాంప్రసాద్ స్కిట్ లో రోహిణి పంచ్ డైలాగులు మాములుగా లేవు. రాంప్రసాద్ తన ఇంటికి సంబంధించి ఇంటీరియర్ మీద కోటి రూపాయలు పెట్టానని చెప్పేసరికి ఇంటి మీద కంటే బ్యాంకులో పెడితే ఇంటరెస్ట్ వచ్చేది కదా అని రోహిణి ఆనందంతో రాంప్రసాద్ నవ్వుకున్నాడు. భోజనంలోకి ఏం వండమంటావ్ అని రోహిణి అడిగింది .." నా తలకాయ వండు" అని చెప్పాడు. "పులుసు పెట్టమంటావా, ముక్కలు పెట్టమంటావా" అని రివర్స్ లో అడిగింది. "ఇగురు పెట్టుకో" అన్నాడు రాంప్రసాద్ . "అంత ఎగిరెగిరి ఏం పెడతాను మావా" అని రోహిణి మరో పంచ్ వేసేసరికి రాంప్రసాద్ పళ్ళు నూరేసాడు కోపంతో. ఇలా ఈ వారం స్కిట్ లు అలరించడానికి రాబోతున్నాయి.
![]() |
![]() |